Sunday, January 19, 2025
HomeTrending Newsమహిళా పక్షపాతి జగన్ : రోజా

మహిళా పక్షపాతి జగన్ : రోజా

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం ద్వారా సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 4  లక్షల కోట్ల విలువైన ఆస్తులు పంపిణీ చేశారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదన్నారు. మహిళా పక్షపాతిగా సిఎం జగన్ నిలిచిపోతారని, సంక్షేమ పథకాల్లో అధిక భాగం మహిళలకే అందిస్తున్నారని వివరించారు. నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

పేదల ఇళ్లస్థలాల కోసం భూ సేకరణ చేస్తే.. భూ కుంభకోణం జరిగిందంటూ టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారని రోజా ఆరోపించారు. మైలవరం లో కూడా దేవేనిని ఉమా ఇళ్ళ కోసం కేటాయించిన స్థలాలను అక్రమ మైనింగ్ అంటూ హడావుడి చేశారని, అధికారులను దుర్భాషలాడారని రోజా విమర్శించారు. దేవినేని అనవసరంగా అలజడి సృష్టించి జైలుపాలయ్యారని వ్యాఖ్యానించారు,.

RELATED ARTICLES

Most Popular

న్యూస్