అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల అతి త్వరలో శ్రీకారం చుడతామని తాడికొండ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. మందడంలో నూతన సచివాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్నది ఫోటో ఉద్యమం మాత్రమేనని ఆమె విమర్శించారు.
కాగా, ఎమ్మెల్యే శ్రీదేవిని ఆదుకునేందుకు రాజధాని రైతులు ప్రయత్నించారు, పోలీసులు వారిని ఆదుకున్నారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సైన్డ్ రైతులకు కౌలు, అమరావతి పింఛను కోసం వినతి పత్రం ఇద్దమనుకుంటే అరెస్ట్ లు చేస్తారా అంటూ వాపోయారు. రైతులెవరూ తనను కలిసేందుకు రాలేదని, రైతులు వచ్చి కలిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీదేవి స్పష్టం చేశారు.