ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం 40 వేల నుంచి 88 వేల క్యూసెక్కులకు పెంచడంపై అభ్యంతరం తెలియజేశారు. తెలంగాణ ఎత్తిపోతల పతకాలతోపాటు, రాయలసీమ లిఫ్ట్ వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్రమైన నష్టం జరుగుతుందని వారు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), డోలా బాల వీరాంజనేయ స్వామీ (కొందేపి)లు సంయుక్తంగా లేఖ రాశారు.
శ్రీశైలం ప్రాజెక్టులో నీరు నిండుగా లేనప్పుడు ప్రాజెక్టులు కట్టడంతో తమ జిల్లా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు చానల్ ను దగ్గుబాడు వరకూ పొడిగించాలని కోరారు. తమ జిల్లాలోని పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్‌పైనే ఆధారపడి ఉన్నాయన్నని, ఈ స్థితిలో ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో ప్రకాశం జిల్లాకు నష్టం జరిగేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.