Sunday, January 19, 2025
HomeTrending Newsఎమ్మెల్యేల కేసులో.. సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యేల కేసులో.. సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరించింది. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సిట్ దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందించాలని ఉత్తర్వులు ఇచ్చింది.
నిందితులకు బెయిల్ తిరస్కరణ
మొయినాబాద్​ ఫాం హౌస్​ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‭ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపు లాయర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ పై పోలీసులు పీటీ వారెంట్ కోరారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే.. నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడ్ని అరెస్ట్‭ చేసేందుకు అనుమతించాలని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ2గా ఉన్న నందకుమార్.. ఇప్పటికే చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పోలీసులు వేసిన పీటీ వారెంట్‭కు నాంపల్లి కోర్టు అనుమతిస్తే.. నిందితుడు నందకుమార్ ను అరెస్ట్ చేసి తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.

Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రిమాండ్ కు తిరస్కరణ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్