ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో వైఎస్సార్సీపీ చేసిన సామాజిక న్యాయాన్ని గడపగడపకూ తెలియజెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మొత్తం 18 మందిని ఎంపిక చేస్తే దానిలో 14సీట్లు బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేటాయించామని, గతంలో ఎప్పుడూ ఇంత గొప్ప కేటాయింపు వెనుకబడిన వర్గాలకు జరగలేదని వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన అనతరం సిఎం జగన్ వారితో భేటీ అయ్యారు. పదవులు తీసుకున్నవారు క్రియాశీలకంగా పని చేయాలని, పదవులు రాని ఆశావహులకు సర్ది చెప్పాలని సూచించారు.
అవినీతికి తావులేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని… విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని, మనం చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని కోరారు.
Also Read : మర్రికి అవకాశం – బిసిలకు పెద్ద పీట : వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు