Friday, February 21, 2025
HomeTrending Newsజనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

వైసీపీ నేత, శాసనమండలి సభ్యుడు చేన్నుబోయిన శ్రీనివాసరావు (వంశీకృష్ణ యాదవ్) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంశీకి సాదరంగా స్వాగతం పలికారు.

ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు తమకు చాలా ముఖ్యమని, రాష్ట్ర రాజకీయాల్లో జనసేన కీలకపాత్ర పోషించబోతోందని, వంశీకృష్ణ లాంటి నేతలు రాష్ట్రానికి  అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2009లో యువరాజ్యం సమయం నుంచే వంశీతో తనకు పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. పార్టీలో ఆయనకు తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. అప్పట్లో యువరాజ్యంలో పనిచేసిన వారిలో చాలామంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక స్థానాల్లో ఉన్నారన్నారు.

సొంత కుటుంబంలోకి వచ్చినట్లు భావిస్తున్నానని వంశీకృష్ణ అన్నారు. ఓ అభిమానిగా తాను ప్రజారాజ్యం పార్టీలో చేరానని, యువరాజ్యంలో పవన్ తో కలిసి పనిచేశానని.. పార్టీ మారిన అభిప్రాయం కలగడం లేదని, ఓ అభిమానిగా ఏ పార్టీలో ఉన్నా ఇప్పటికీ పవన్ సినిమాలు మొదటి రోజే చూస్తానన్నారు. తనకు అవకాశం కల్పించిన పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీలో ఎంత చిత్తశుద్దితో పని చేశానో అంతే విధంగా జనసేనలో పనిచేస్తానని, ప్రతి సమస్య పరిష్కారంలో పవన్ వెంట నడుస్తానని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్