Friday, October 18, 2024
HomeTrending Newsచారీ సాబ్ కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ

చారీ సాబ్ కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ

MLC IN Governor Quota For Madhusudanachari :

మాజీ స్పీకర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరు ప్రతిపాదిస్తూ రాజ్‌భవన్‌కు ఫైలును పంపించగా… గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై సస్పెన్స్ తొలగినట్లయింది. గతంలో పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కడంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారికి అవకాశం ఇచ్చారు.

ముఖ్యమంత్రి ఓ.ఎస్.డి దేశపతి శ్రీనివాస్ పేరు కూడా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ జాబితాలో వినిపించినప్పటికీ.. సీఎం కేసీఆర్ మధుసూదనచారి వైపే మొగ్గుచూపారు. మధుసూదానాచారి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నారు. చారీ సాబ్ అంటూ కెసిఆర్ మధుసూదనాచారిని ఆప్యాయంగా పలకరిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది స్పీకర్‌గా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి మధుసూదనాచారికి ఏ పదవి దక్కలేదు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఎమ్మెల్సీగా కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు.

Also Read : కెసిఆర్ అనాలోచిత విధానాలు – ఈటెల

RELATED ARTICLES

Most Popular

న్యూస్