Friday, November 22, 2024
Homeతెలంగాణపేదల సొంత ఇంటి కల నేరవేరుస్తాం

పేదల సొంత ఇంటి కల నేరవేరుస్తాం

పేదవారి సొంత ఇంటి కల నేరవర్చడేమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత వెల్లడించారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాల నియోజవర్గానికి నాలుగు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు మంజూరు చేశారని వివరించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లి గ్రామ శివారులో  నిర్మితమవుతున్న 4520 డబుల్ బెడ్రూం  ఇండ్లను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ రవినాయక్, మునిసిపల్ చైర్ పర్సన్ భోగశ్రావణి లతో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్  ఇండ్ల నిర్మాణలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇండ్ల నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తిఅయ్యేలా పర్యవేక్షిస్తున్నారని కవిత ప్రశంసించారు. జగిత్యాల జిల్లా కేంద్రం కావాలనే దశాబ్దాల కల నెరవేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లకు కెసిఆర్ కట్టిస్తున్న ఇళ్ళకు తేడా ఏందో ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలో ఇళ్ళ నిర్మాణ పురోగతి పై ఉన్నతాధికారుల ద్వారా ముఖ్యమంత్రి నివేదిస్తామని కవిత పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్ లో గా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తి చేసి పేదవారి సొంత ఇంటి కల నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.

జగిత్యాల జిల్లా అభివృద్ది కి తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్సి కవిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చుతున్నారని గుర్తు చేశారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసి ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక సిఎం తీర్చారన్నారు. దీంతో జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, అనేక మందికి ఉపాధి లభిస్తుందని కవిత సంతోషం వ్యక్తం చేశారు. జగిత్యాలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తో మాట్లాడు తానని ఎమ్మెల్సి కవిత హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్