Saturday, January 18, 2025
Homeతెలంగాణరైతుకు నష్టం లేకుండా ప్యాకేజీ 21 నిర్మాణం: కవిత

రైతుకు నష్టం లేకుండా ప్యాకేజీ 21 నిర్మాణం: కవిత

దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్యాకేజీ 21 నిర్మాణం జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. నిజామాబాద్ లో పర్యటించిన కవిత కాళేశ్వరం లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ పనులను పరిశీలించారు. రైతులు భూములు కోల్పోకుండా, భూగర్భం నుండే పైప్ లైన్స్ ద్వారా ప్రతి ఎకరాకు నీరందించనున్నామని తెలిపారు.

ప్యాకేజీ 21 తో నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్న కవిత, ఈ సీజన్ లో పైలెట్ ప్రాజెక్టుగా 20వేల ఎకరాలకు నీరందించి, రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంచిప్ప రిజర్వాయర్ పనుల ద్వారా నష్టపోయే  రైతులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని కవిత హామీ ఇచ్చారు.

రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా బడ్జెట్ లో రూ.1600 కోట్లను అదనంగా కేటాయించడంతో,  ఇది రైతు ప్రభుత్వమని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీని త్వరలోనే పూర్తి చేసి దేశ చరిత్రలో నిలిచేలా చేస్తామని కవిత తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్