Tuesday, March 10, 2026
HomeTrending Newsరోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జీ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జీ దుర్మరణం

పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకువాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం పాలయ్యారు. ఏలూరు ఆశా వర్కర్స్ యూనియన్ కు మద్దతు  తెలిపేందుకు భీమవరంనుంచి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకివీడు దాటిన తర్వాత ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీ కొట్టింది. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ఎమ్మెల్సీ అక్కడికక్కడే మరణించారు. ఆయన మృతదేహాన్ని భీమవరం ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్సీ గన్ మెన్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే  జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవి ప్రకాష్ భీమవరం హాస్పిటల్ కు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

2011లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సాబ్జీ విజయం సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular