Zakia to be the Dy. Chairman:
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో కలిసి అసెంబ్లీ ఆవరణలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన జకియా ఖానమ్ కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచీ కొనసాగుతోంది. జకియా భర్త రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. గత ఏడాది జులైలో ఆమెను గవర్నర్ కోటాలో శాసన మండలికి సిఎం జగన్ ఎంపిక చేశారు.
ఇటీవలే మండలి చైర్మన్ గా దళిత వర్గానికి చెందిన మోషేన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ ఛైర్మన్ పదవిని మైనార్టీ వర్గానికి చెందిన మహిళకు కేటాయించారు సిఎం జగన్. జకియా ఒక్కరే ఈ పదవికి నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నికను ఈ మధ్యాహ్నం లాంఛనంగా ప్రకటించనున్నారు.
Also Read : సిఎం జగన్ తో బీసీ నేతల భేటి