Mohan Lal: యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. కేజీఎఫ్ 2 తో ప్రశాంత్ నీల్ చరిత్ర సృష్టించడంతో ఎన్టీఆర్ ను ఎలా చూపింబోతున్నారు? ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారు అని అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ ఆతృతగా ఎదురు చూస్తుంది.
ఇదిలా ఉంటే.. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర సినిమాకే మెయిన్ హైలైట్ గా ఉంటుందట. ఆ పాత్ర కోసం యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ ని కాంటాక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా దాదాపుగా కమల్ నటించడం ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. అయితే.. విక్రమ్ మూవీ భారీ సక్సెస్ సాధించడంతో కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించడం లేదట.
అందుకే.. ప్రశాంత్ నీల్ ఆ పాత్ర కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్, మోహన్ లాల్ కలిసి జనతా గ్యారేజ్ మూవీలో నటించారు. మరోసారి ఈ సినిమా కోసం కలిసి నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను ప్రశాంత్ నీల్ అక్టోబర్ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. మరి.. ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ గా చూపించి.. బాక్సాఫీస్ దగ్గర మరోసారి చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.