Saturday, January 18, 2025
Homeసినిమాచ‌ర‌ణ్ మూవీలో మోహ‌న్ లాల్?

చ‌ర‌ణ్ మూవీలో మోహ‌న్ లాల్?

రామ్ చ‌ర‌ణ్‌,  డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. శంకర్ తెలుగులో చేస్తున్న ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో ఈ మూవీ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌సన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ న‌టిస్తుంది.

ఈ మూవీలో మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని తెలిసింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ స్పెషల్ ఎపిసోడ్ లో మోహన్ లాల్ క‌నిపిస్తార‌ట‌. సినిమా మొత్తంలో ఈ ఎపిసోడ్ చాలా కీలకం అని, అందుకే.. శంకర్ ఈ పాత్ర కోసం మోహన్ లాల్ ను ఎంపిక చేశార‌ని అని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా క‌నిపించే ఆఫీస‌ర్ గా కనిపిస్తాడట. మోహ‌న్ లాల్ ఈ మూవీలో న‌టిస్తున్నార‌ని తెలిసినప్ప‌టి నుంచి మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త వాస్త‌వ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

Also Read: ఎన్టీఆర్ మూవీలో క‌మ‌ల్ ప్లేస్ లో మోహ‌న్ లాల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్