Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీలోకి అడుగుపెడుతున్న మోహన్ లాల్ మూవీ!  

ఓటీటీలోకి అడుగుపెడుతున్న మోహన్ లాల్ మూవీ!  

మొదటి నుంచి కూడా మోహన్ లాల్ విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. తన క్రేజ్ కీ .. బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ, ఇప్పటికీ కూడా ఆయన అదే స్పీడ్ చూపిస్తున్నారు. సుదీర్ఘమైన ఈ కెరియర్లో ఇప్పటికీ మోహన్ లాల్ సినిమా వస్తుందంటే, రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అందువలన ఆయన అంతే ఉత్సాహంతో  ముందుకు వెళుతున్నారు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే ‘మలై కోట్టై వాలిబన్’.

ఈ సినిమా అక్కడి థియేటర్లకు రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చింది. ఇది దేశభక్తికి .. పోరాట పటిమకు సంబంధించిన సినిమా. అందువలన ఆ రోజున భారీస్థాయిలో విడుదల చేశారు. ముఖ్యంగా మెహన్ లాల్ గెటప్ .. కథా నేపథ్యం ఈ సినిమా గురించి ఆడియన్స్ ఆలోచన  చేయడానికి కారణమైంది. నిజానికి ఈ సినిమాను తెరకెక్కించడం చాలా కష్టమైన పనే .. కంటెంట్ అలాంటిది. అయినా ఇది థియేటర్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ ను అందుకోలేకపోయింది.

థియేటర్స్ వైపు నుంచి మలయాళంలో మాత్రమే విడుదలైన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులోనూ ఈ నెల 23వ తేదీన ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన కూడా చేశారు. మరి ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్