Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్యకు వార్నింగ్ ఇచ్చిన మోక్షజ్ఞ. ఇంతకీ.. ఏమైంది..?

బాలయ్యకు వార్నింగ్ ఇచ్చిన మోక్షజ్ఞ. ఇంతకీ.. ఏమైంది..?

నందమూరి బాలకృష్ణకు ఆయన తనయుడు మోక్షజ్ఞ వార్నింగ్ ఇచ్చారు. ఏమని వార్నింగ్ ఇచ్చారంటారా.? భగవంత్ కేసరి సినిమాలో నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఉపయోగించి నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని వార్నింగ్ ఇచ్చారట. తండ్రికి తనయుడు వార్నింగ్ ఇవ్వడం ఏంటి..? ఇది నిజం కాదు. ఫేక్ న్యూస్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అవును.. ఇది నిజంగా నిజం. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ చెప్పారు. ఎప్పుడు..? ఎక్కడ చెప్పారంటారా..? భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలయ్య ఈ విషయం బయటపెట్టారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ భగవంత్ కేసరి. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తే.. కూతురుగా శ్రీలీల నటించింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హనుమకొండలో జరిగింది. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ… శ్రీలీల చిచ్చా చిచ్చా అంటూ చాలా ఇబ్బంది పెట్టింది. నెక్ట్స్ సినిమాలో హీరో, హీరోయిన్ గా నటిద్దామని చెప్పారు. ఇదే విషయాన్ని బాలయ్య ఇంటికి వెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ కి, మోక్షజ్ఞకి చెబితే.. నేను హీరోగా రాబోతున్నాను. నువ్వు ఆమెకి ఆఫర్ ఇస్తావేంటి..?  నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని వార్నింగ్ ఇచ్చాడట.

ఈ విషయాన్ని బాలయ్య చెప్పడంతో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ స్టేజ్ పై ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ఈ విధంగా బాలయ్య అసలు విషయం బయటపెట్టారు. అలాగే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని మరోసారి చెప్పారు. బాలయ్య అంతే.. ఎప్పుడు..? ఏం మాట్లాడతారో..? ఏం విషయం చెప్చచ్చో ఏం విషయం చెప్పకూడాదో ఏమీ ఆలోచించరు. ఆయనకు ఆ క్షణంలో ఏది అనిపిస్తే.. అది మాట్లాడేస్తారు. మోక్షజ్ఞ వార్నింగ్ ఇవ్వడం గురించి చెప్పిన బాలయ్య మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్