Saturday, January 18, 2025
Homeసినిమాబోయపాటితోనే మోక్షజ్ఞ మూవీ?

బోయపాటితోనే మోక్షజ్ఞ మూవీ?

నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయం కోసం అభిమానులంతా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ‘ఆదిత్య 369’లో బాలయ్యతో పాటు కనిపించనున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తరువాత తన వయసుకి తగినట్టుగా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో రానున్నాడనే టాక్ నడిచింది. ఫలానా దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం సాగింది. కానీ ఆ తరువాత ఆ వార్తలు నిలబడలేదు. అవన్నీ కూడా కేవలం ప్రచారాలుగా మాత్రమే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ మోక్షజ్ఞ దర్శకుడిగా బోయపాటి పేరు వినిపిస్తోంది.

బోయపాటికి మాస్ యాక్షన్ పల్స్ బాగా తెలుసు. తెరపై హీరోయిజాన్ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్లడంలో ఆయనకి మంచి పేరు ఉంది. అందునా బాలకృష్ణతో ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్. ఆయన టేకింగ్ పై బాలకృష్ణకి బలమైన నమ్మకం ఉంది. అందువలన హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను బోయపాటికే అప్పగించాలనే ఒక ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారనీ, అందుకు సంబంధించిన చర్చలు కూడా రీసెంటుగా జరిగాయని చెబుతున్నారు.

నందమూరి హీరోలకు మొదటి నుంచి కూడా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. బాలకృష్ణ దానిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. అందువలన తన తనయుడి ఫస్టు మూవీ కూడా మాస్ యాక్షన్ ప్రధానంగా సాగితేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడని అంటున్నారు. ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇటీవల బాలకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలో బాలకృష్ణ – బోయపాటి ‘అఖండ 2’ కోసం సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ ప్రాజెక్టు అయిన తరువాతనే మోక్షజ్ఞ ప్రాజెక్టు మొదలవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు వివరాలను ప్రకటిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్