Friday, March 20, 2026
HomeTrending Newsకామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం

కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం

కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌‌ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో, అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలించినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ వ్యక్తి జులై 6వ తేదీన కువైట్ నుంచి వచ్చారు. 20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి రాషెస్‌ రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లాడు.

అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అక్కడ్నుంచి 108లో అతన్ని ఫీవర్‌‌ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేస్తునట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులు వెల్లడించారు. సాంపిల్ సేకరించి, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు తెలిసింది.

అంతవరకు ఫీవర్‌‌ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ అందజేస్తుతున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించగా..  వాళ్లెవరికీ సింప్టమ్స్‌ లేవు. అయినప్పటికీ వారిని ఐసోలేట్ చేశామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ప్రజలు మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular