Sunday, September 8, 2024
Homeసినిమా‘మంత్ ఆఫ్ మ‌ధు’ .. ఆకట్టుకుంటోన్న టీజర్

‘మంత్ ఆఫ్ మ‌ధు’ .. ఆకట్టుకుంటోన్న టీజర్

వైవిధ్యమైన పాత్రలతో  తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ న‌వీన్ చంద్ర‌. లేటెస్ట్ మూవీ ‘మంత్ ఆఫ్ మ‌ధు’.  శ్రీకాంత్ నాగోటి దర్శ‌క‌త్వంలో క్రిష్వి ప్రొడ‌క్ష‌న్స్‌, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యాన‌ర్స్ పై య‌శ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన  ‘భానుమతి అండ్ రామకృష్ణ’ 2020లో ఆహా ఓటీటీలో విడుదలైంది.  ఈ హిట్ కాంబో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది. రీసెంట్‌గా రిలీజైన  ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  తాజాగా విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులనుంచి  అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది.

మాన‌వ సంబంధాలు.. ఓ విష‌యాన్ని జనం ఏ కోణంలో చూస్తున్నార‌నే దానిపైనే ‘మంత్ ఆఫ్ మ‌ధు’  చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. క‌ల‌ర్స్ స్వాతి ఇందులో గృహిణి పాత్ర‌లో న‌టించింది. విప‌రీత‌మైన భావోద్వేగాలున్న తాగుబోతు భ‌ర్త పాత్ర‌లో న‌వీన్ చంద్ర యాక్ట్ చేశారు. వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో లైవ్ లోకేష‌న్స్‌లో సింక్ సౌండ్‌తో ‘మంత్ ఆఫ్ మ‌ధు’  సినిమాను రూపొందించారు. శ్రేయా న‌వేలీ, హ‌ర్ష చెముడు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ చిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్