Mosen Raju: APLC chairman:
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ గా ఎమ్మెల్సీ కొయ్యే మోషన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు మోషేన్ రాజు మండలి చైర్మన్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి పి. బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయనను ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ చక్రవర్తి, గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదించారు. అయన ఒక్క నామినేషనే దాఖలు కావడంతో అయన ఎన్నికను రేపు, శుక్రవారం అధికారికంగా ప్రకటిస్తారు. అంతకుముందు ఛైర్మన్ ఎన్నికకు ఆసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు.
మోషేన్ రాజు 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్సార్సీపీలో మొదటినుంచీ కొనసాగుతున్నారు, 2014, 19 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం రాకపోయినా నిరాశ చెందకుండా పార్టీ విజయం కోసం కృషి చేశారు. శాసన మండలికి ఈ ఏడాది జూన్ 14న గవర్నర్ కోటాలో నామినేటెడ్ అయ్యారు.
Also Read : 26 వరకు అసెంబ్లీ సమావేశాలు