Tuesday, March 17, 2026
Homeసినిమా‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వ్రాప్ అప్ పార్టీ

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వ్రాప్ అప్ పార్టీ

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా న‌టించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ .  మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాత బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్త‌య్యింది. అక్కడ్నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది. వినోదాత్మకంగా జరిగిన ఈ పార్టీకి హీరో అఖిల్ అక్కినేనితో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఈ కార్యక్రమంలో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించారు.

ఇక సినిమా విషయానికి వస్తే… ప్రేమ, కెరీర్, పెళ్లి చుట్టూ అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మధ్యలో పెళ్లి, పార్ట్‌నర్ గురించి వచ్చే మాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా ఖ‌చ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తున్నారు చిత్ర యూనిట్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రూపొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular