Thursday, March 19, 2026
Homeసినిమా'భోళా శంకర్' నుంచి మోషన్ పోస్టర్‌ విడుదల

‘భోళా శంకర్’ నుంచి మోషన్ పోస్టర్‌ విడుదల

చిరంజీవి, మెహర్ రమేష్ ల కాంబినేషన్లో రూపొందుతోన్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్ పోస్టర్ లో చిరంజీవి ఫెరోషియస్ గా కనిపించారు. చేతిలో డమరుకం పట్టుకుని నటరాజ నాట్యం చేస్తున్నట్లు కనిపించారు. శివుడు శివతాండవం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

మహతి స్వర సాగర్ పోస్టర్‌కి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఇంటెన్సిటీ తెచ్చారు. ఈ పోస్టర్ మహా శివరాత్రి సందర్భానికి తగినట్లు ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో డాజ్లింగ్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మరి.. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ సాధించిన మెగాస్టార్ భోళా శంకర్ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular