Sunday, September 8, 2024
HomeTrending Newsవిద్యావ్యవస్థలో సువర్ణాధ్యాయం: సిఎం జగన్

విద్యావ్యవస్థలో సువర్ణాధ్యాయం: సిఎం జగన్

ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం నేడు చేసుకున్న ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు.  రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదమని, ఇప్పుడు ‘నాణ్యమైన విద్య హక్కు’ అనేది సరికొత్త నినాదంగా మారిందని అభిప్రాయపడ్డారు.  నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే… మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారన్నారు. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో … సిఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడిన ముఖ్యాంశాలు

⦿ ఈ దేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ, ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం
⦿ మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి, మంచి మంచి జీతాలు సంపాదించాలి
⦿ నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం, విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి
⦿ అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే
⦿ ఫలాలు అందడానికి కొంత సమయం పట్టొచ్చు, కాని ఎక్కడో ఒకచోట ప్రారంభించాల్సిన అవసరం ఉంది
⦿ ఉన్నతవిద్యలో మనం వేస్తున్న అడుగులు ఫలాలు ఇవ్వాలంటే బహుశా నాలుగైదేళ్లు పట్టొచ్చు
⦿ ప్రాథమి విద్య స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ కూడా సమూలంగా మార్చుకుంటూ వస్తున్నాం
⦿ మానవవనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా మన ప్రభుత్వం భావిస్తోంది
⦿ అందుకనే ప్రతి అడుగులోనూ కూడా చిత్తశుద్ధి, అంకిత భావం చూపిస్తున్నాం
⦿ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టాం, గ్లోబల్‌ సిటిజన్‌ కావాలంటే మన మాట్లాడే భాషలో మార్పులు రావాలి
⦿ ప్రపంచస్థాయితో పోటీపడాలి. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదు
⦿ ఇంగ్లిషు మీడియం నుంచి నాడు-నేడు, అమ్మ ఒడి, గోరుముద్దతో మన ప్రయాణం ప్రారంభమైంది, అక్కడితో మనం ఆగిపోలేదు.
⦿ రాబోయే పదేళ్లలో టెన్త్‌ విద్యా్ర్థి ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం, ఎంఓయూ చేసుకున్నాం
⦿ వచ్చే విద్యాసంవత్సరం టీచర్లకు సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టిపెట్టాం
⦿ ఆరోతరగతి నుంచి ప్రతి తరగతి గదినీ డిజిటలైజేషన్‌ చేస్తున్నాం
⦿ ట్యాబ్స్‌ ఇచ్చి పిల్లలకు చదువులు సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నాం
⦿ బైజూస్‌ కంటెంట్‌తో అనుసంధానం చేశాం
⦿ అత్యున్నత విద్యలో కూడాఇలాంటి అడుగులు వేయాల్సిన అవసరాన్ని భావించి… దానిపై కూడా దృష్టిపెట్టాం
⦿ రాష్ట్రంలోని 18 యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీచేయడానికి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
⦿ ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది
⦿ 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే NAAC గుర్తింపు పొందగా, ఈరోజు రాష్ట్రంలోNAAC గుర్తింపు పొందిన విద్యా సంస్థలు 437 ఉన్నాయి
⦿ ఎడ్‌క్స్‌తో ఈరోజు చేసుకుంటున్న ఒప్పందం మరో అడుగు

⦿ దాదాపు 2వేలకు పైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్‌కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి
⦿ ఐంఐటీ, ఎల్‌ఎస్‌ఈ, హార్వర్డ్‌ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులుకూడా దీనిద్వారా నేర్చుకోవచ్చు
⦿ క్రెడిట్స్‌ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి
⦿ మన దగ్గర అందుబాటులో లేని కోర్సులు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది
⦿ అత్యుత్తమ యూనివర్శిటీల నుంచి సర్టిఫికెట్లు ఉండడంవల్ల ఉద్యోగం సాధనమరింత సులభతరం అవుతుంది
⦿ మన పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమే
⦿ నాణ్యమైన విద్య వారికి అదించగలిగితే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి
⦿ టాప్‌ -50 ర్యాంకింగ్స్‌లో ఉన్న 320 కాలేజీల్లో సీటు వస్తే.. రూ.1.2 కోట్ల వరకూ కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్