Friday, March 13, 2026
HomeTrending Newsఇక రాజకీయాలు వద్దు

ఇక రాజకీయాలు వద్దు

ఇక‌పై ప్ర‌జా స‌మస్య‌లు తీర్చేందుకు ప్ర‌జ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటానని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇక నుంచి నన్ను రాజ‌కీయాల్లోకి లాగ‌వ‌ద్దని కేవలం ప్రజల కోసమే పని చేస్తానన్నారు. ఇప్ప‌టి నుంచి రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌నని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి భువ‌న‌గిరి, న‌ల్గొండ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ప్ర‌తి గ్రామంలో ప‌ర్య‌టించి అక్క‌డ స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారానికి కృషి చేస్తానన్నారు.

గ్రామాల అభివృద్దికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పోరాడి నిధులు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తానన్న వెంకటరెడ్డి పూర్తిస్థాయిలో సేవా కార్యక్ర‌మాల మీదే దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాని వెల్లడించారు. ప్ర‌తీక్ ఫౌండేష‌న్ ద్వారా వీలైనంత ఎక్కువ‌గా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతానని, న‌ల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎవ‌రైనా నా తలుపు త‌ట్ట‌వచ్చని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular