Tuesday, March 10, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వారి ఆందోళనలో చిత్తశుద్ధి లేదు

వారి ఆందోళనలో చిత్తశుద్ధి లేదు

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము  పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వైసీపీ ఎంపిలు సిద్ధంగా ఉన్నారా అని లోక్ సభలో తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ రాయుడు సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్,  ఏపీకి ప్రత్యేక హోదా అంశాల్లో వైసీపీ ఎంపీలు చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి లోపించిందని, కేవలం ప్రచార ఆర్భాటం కోసం, ఫోటోల కోసమే వారు ఆందోళన చేస్తున్నారని రామ్మోహన్ ఎద్దేవా చేశారు.

రెండేళ్లపాటు వారికి హోదా అంశం గుర్తు లేదా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఓ వైపున ధరల పెరుగుదల, పెగాసస్ అంశాలపై విపక్షాలు పోరాటం చేస్తుంటే వైసీపీ సభ్యులు మాత్రం ప్లే కార్డులతో ఫోజులిస్తున్నారని విమర్శించారు. చిత్తశుద్ది లేని వారి పోరాటంలో తాము భాగస్వామ్యం అయ్యే ప్రసక్తే లేదని రామ్మోహన్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular