Sunday, January 19, 2025
Homeసినిమా‘మిస్టర్ ప్రెగ్నెంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 18న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తెలుగు తెరపై ఇదొక కొత్త తరహా ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. సినిమా ఔట్ పుట్ విషయంలో చిత్రబృందం సంతృప్తిగా ఉన్నారు. రిలీజ్ కు కూడా ఆగస్టు 18 మంచి డేట్ గా భావిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సక్సెస్ సాధిస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని.. ఈ సినిమాను కూడా ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉందని చిత్ర దర్శకనిర్మాతలు తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్