Friday, March 20, 2026
Homeసినిమామృణాల్ బర్త్ డే.. ‘హాయ్ నాన్న’ సరికొత్త పోస్టర్ రిలీజ్

మృణాల్ బర్త్ డే.. ‘హాయ్ నాన్న’ సరికొత్త పోస్టర్ రిలీజ్

నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందుతోన్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. ఈ చిత్రం గ్లింప్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చివర్లో మృణాల్ ఠాకూర్ నానిని ‘హాయ్ నాన్నా’ అని పిలవడం ఆసక్తిని పెంచింది. గ్లింప్స్ సీక్వెన్స్ చూడడానికి అందంగా ఉండటంతో పాటు సినిమాలో వారి రిలేషన్ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించింది.

ఈ రోజు మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్  సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.మృణాల్ ఆకర్షణీయమైన చిరునవ్వుతో కనిపించగా, నాని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించారు. చెవిపోగులు, ముక్కుపుడక ధరించింది మోడిష్ లుక్‌ లో ఆకట్టుకున్నారు మృణాల్. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ కి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ‘హాయ్ నాన్న’ ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular