Wednesday, March 18, 2026
Homeసినిమాదూకుడు పెంచుతున్న మృణాళ్ ఠాకూర్! 

దూకుడు పెంచుతున్న మృణాళ్ ఠాకూర్! 

టీవీ నుంచి వెండితెరకి వచ్చిన హీరోయిన్స్ జాబితాలో మృణాల్ ఠాకూర్ ఒకరుగా కనిపిస్తుంది. టీవీ ద్వారా ఎక్కువ మంది అభిమానులను .. క్రేజ్ ను సంపాదించుకున్న ఆమె, 2014లోనే మరాఠి సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బాలీవుడ్ దిశగా అడుగులు వేసి, అక్కడ కూడా చాలా వేగంగానే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాతనే ఆమె ‘సీతారామం’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. ఈ సినిమా ఆమెకి ఇతర భాషల్లోను మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

‘సీతారామం’ తరువాత తెలుగు ఇండస్ట్రీ దృష్టి ఒక్కసారిగా మృణాళ్ ఠాకూర్ పై పడింది. అందుకు కారణం ఆ సినిమాతో ఇక్కడ ఆమె పాప్యులారిటీ ఒక్కసారిగా పెరిగిపోవడమే. ఒక వైపున హిందీలో వరుస ప్రాజెక్టులు చేస్తూనే, తెలుగు నుంచి వెళ్లిన అవకాశాలను ఆమె అందుకుంటోంది. అలా తెలుగులో ఆమె రెండు సినిమాలు చేస్తోంది. ఒకటి నాని సరసన అయితే, మరొకటి విజయ్ దేవరకొండ జోడీగా కావడం విశేషం.

నాని హీరోగా ‘హాయ్ నాన్న‘ సినిమా రూపొందుతోంది. వైరా బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, డిసెంబర్ 7వ తేదీన విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్‘ లోను మృణాళ్ సందడి చేయనుంది. ఈ రెండు సినిమాల తరవాత ఇక్కడ మృణాళ్ దూకుడు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే జరుగుతుందేమో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular