Friday, March 13, 2026
HomeసినిమాMrunal Thakur: చిరుకు జంటగా మృణాల్..?

Mrunal Thakur: చిరుకు జంటగా మృణాల్..?

చిరంజీవి భోళాశంకర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. రీమేక్ సినిమాలను జనాలు చూడడం లేదనే విషయాన్ని గ్రహించారు. అందుకనే ఇక నుంచి రీమేక్ మూవీలు చేయకూడదని ఫిక్స్ అయ్యారు. బ్రో డాడీ రీమేక్ చేయాలనుకున్న చిరు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అందుకనే బ్రో డాడీ రీమేక్ ని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేశారు. ఓరిజినల్ స్టోరీతో చేయాలి అనుకున్న 157మూవీని ప్రకటించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించనున్నాడు. యు.వీ. క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇది సోసియో ఫాంటసీ మూవీగా రూపొందనుందని.. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఉంటుందని వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ ను ఫైనల్ చేయాలి అనుకుంటున్నారని తెలుస్తోంది. మృణాల్ తో పాటు ఒకరిద్దరి పేర్లను పరిశీలించినప్పటికీ.. ఫైనల్ గా మేకర్స్ మృణాల్ నే ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.

అయితే.. ఈ సోసియో ఫాంటసీ మూవీలో ఒక్క హీరోయినే కాదు.. ఎనిమిది మంది కథానాయికలు ఉంటారని ప్రచారం జరిగింది. మెయిన్ హీరోయిన్ మృణాల్ అయినప్పటికీ.. ఇంకా చాలా మంది కథానాయికలు ఉంటారట. దీంతో ఇంకా ఎవరెవరు నటించనున్నారు అనేది ఆసక్తిగా మారింది. మరో విషయం ఏంటంటే.. ఇందులో ఓ పాప కీలక పాత్ర పోషించనుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అంతా రెడీ అయిన తర్వాత పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మరి.. భోళాశంకర్ తో డీలాపడ్డా చిరు.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular