Friday, March 20, 2026
Homeసినిమాతెలుగు తెరకి మరో కొత్త కథానాయిక! 

తెలుగు తెరకి మరో కొత్త కథానాయిక! 

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. అందం .. అభినయం ఉంటే చాలు, ఏ ప్రాంతం నుంచి వచ్చారనే విషయాన్ని పక్కన పెట్టేసి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అందువల్లనే ఇతర భాషల నుంచి వచ్చిన కథానాయికల జోరు ఇక్కడ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త కథానాయికలు తెలుగు తెరపైకి వచ్చారుగానీ, కృతి శెట్టి .. శ్రీలీల స్థాయిలో ఎవరూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే మరో కథానాయిక ‘సీతా రామం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది .. ఆ నాయిక పేరే ‘మృణాల్ ఠాకూర్’.

మృణాల్ ఠాకూర్ మహారాష్ట్ర బ్యూటీ .. ఆమె ఇంతవరకూ చేస్తూ వచ్చిన సినిమాలు కూడా మరాఠీవే. 2014లోనే ఆమె తన కెరియర్ ను మొదలుపెట్టింది. కొన్ని సీరియల్స్ లో చేసింది .. మరికొన్ని మ్యూజికల్ ఆల్బమ్స్ లోను మెరిసింది. తాజాగా ‘సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ ను బట్టి, ఈ కథ 1960లలో మొదలవుతుందనే విషయం అర్థమవుతోంది. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథాంశమనే విషయం స్పష్టమవుతోంది. టీజర్ .. ట్రైలర్ ను బట్టి చూస్తే మృణాళ్ పెద్ద అందగత్తేమీ కాదనే విషయం తెలుస్తూనే ఉంది. ఈ కథ నడిచే కాలాన్ని బట్టి కూడా అంత గ్లామర్ గా  చూపించవలసిన అవసరం లేదనుకున్నారేమో. కథాకథనాల పరంగా .. సన్నివేశాల పరంగా మంచి ఫీల్ వర్కౌట్ అయినట్టుగానే అనిపిస్తోంది. ఈ సినిమా మృణాళ్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular