Sunday, January 19, 2025
Homeసినిమా21న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్

21న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్

నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. ఈ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాలి కానీ.. కొన్ని కారణాల వలన వాయిదాపడుతూ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్లు  చిత్రబృందం ప్రకటించారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను థియేటర్ లో ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారని.. తప్పకుండా ఈ మూవీ విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. మరి.. ఈ సినిమా ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్