Sunday, February 23, 2025
HomeTrending Newsమిథున్ రెడ్డి చర్చలు సఫలం- వైసీపీలోకి ముద్రగడ

మిథున్ రెడ్డి చర్చలు సఫలం- వైసీపీలోకి ముద్రగడ

కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. నేడు ముద్రగడతో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కిర్లంపూడిలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

ముద్రగడను కలిసి వైసీపీలోకి ఆహ్వానించామని, ఆయన పాజిటివ్ గా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు మిథున్ రెడ్డి వెల్లడించారు. ముద్రగడ ఉన్నత వ్యక్తిత్వం ఉన్న నేత అని, ఆలాంటి వ్యక్తి ఏవో ఆఫర్లకు అంగీకరించి పార్టీలో చేరే మనస్తత్వం కాదని, భేషరతుగా ఆయన పార్టీలో చేరతారని… త్వరలో సిఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా, ముద్రగడ త్వరలోనే వైసీపీలో చేరతారని, రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రచారం చేస్తారని జక్కంపూడి గణేష్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్