Tuesday, March 10, 2026
HomeTrending Newsజగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ

కాపు ఉద్యమనేత, సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి చేరుకున్న ముద్రగడ, ఆయన అనుచరులను వైసీపీ ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెంటబెట్టుకొని సిఎం క్యాంప్ ఆఫీసుకు తీసుకువచ్చారు.

ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముద్రగడను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి సభ్య్వత్వం అందించారు.  ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular