గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా హైదరాబాద్ – విజయవాడ మధ్య రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. నందిగామ సమీపంలోని కీసర వద్ద (NH 65 హైవే పై మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీనితో ఇరువైపులా వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. ఈ మార్గం ద్వారా ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
వాహనాదారులు ఈ క్రింది తెలిపిన మార్గముల ద్వారా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వెళ్ళే వారు…. హైదారాబాద్ – నార్కెట్ పల్లి – మిర్యాలగూడ – దాచేపల్లి – పిడుగురాళ్ల- సత్తెనపల్లి – గుంటూరు – విజయవాడ – ఏలూరు – రాజమండ్రి – విశాఖపట్నంకు వెళ్ళవలెను.
విశాఖ పతనానం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్ళేవారు….. విశాఖపట్నం- రాజమండ్రి- ఏలూరు – విజయవాడ – గుంటూరు – సత్తెనపల్లి – పిడుగురాళ్ళ – దాచేపల్లి – మిర్యాలగూడ – నార్కెట్ పల్లి – హైదరాబాద్ కు వెళ్లాలని కోరారు.
ఎన్.టి.ఆర్. జిల్లా విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువైపులా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. స్థానిక నేతలు, వివిధ పార్టీల కార్యకర్తలు ట్రాఫిక్ లో చిక్కున్న ప్రయాణికులకు ఆహారం, వసతి ఏర్పాటు చేసి సహకరిస్తున్నారు.
ఏదైనా సమాచారం కొరకు పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 7328909090 కు సంప్రదించాలని అధికారులు తెలియజేశారు.