Saturday, February 22, 2025
HomeTrending NewsDouble Bed Room: పేదల కల నెరవేర్చడమే లక్ష్యం - మంత్రి తలసాని

Double Bed Room: పేదల కల నెరవేర్చడమే లక్ష్యం – మంత్రి తలసాని

సొంత ఇల్లు లేని పేదల కల నెరవేర్చడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆన్ లైన్ డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికను ఈ రోజు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్ లు అనుదీప్ దురిశెట్టి, అమయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ సెప్టెంబర్ 2 న కుత్బుల్లాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని మున్సిపల్ మంత్రి KTR ప్రారంభిస్తారని వెల్లడించారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే దేశంలోనే మొదటిసారి ఆన్ లైన్ డ్రా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. NIC రూపొందించిన Randomisation Software ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారిలో నుండి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటివిడతలో 12 వేల మందికి ఇండ్ల పంపిణీ జరుపుతారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు ఆర్ధిక సహాయంతో ఇండ్లను నిర్మించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నారని మంత్రి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్