Sunday, January 19, 2025
HomeTrending Newsమునుగోడుతో కేసీఆర్ కు గుణపాఠం - ఈటల హెచ్చరిక

మునుగోడుతో కేసీఆర్ కు గుణపాఠం – ఈటల హెచ్చరిక

ధీరుడు బాజప్త కొట్లాడతారని దొంగలు చాటుగా దెబ్బ కొడతారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజానీకం నన్ను గెలిపించినందుకు, రఘునందన్ ను డబ్బాకలో గెలిపించినందుకు బాధ పడుతున్నారట…మూర్కుల్లారా(తెరాస ను ఉద్దేశిస్తూ) నేను గెలిచిన నాడు తెలంగాణ ప్రజలంతా పండుగ చేసుకున్నారని ఈటెల అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ ఈ రోజు జె కేసారంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల… తెరాస నేతల వైఖరిపై నిప్పులు చెరిగారు. మమ్ముల్ని గెలిపించి పంపిందే కెసిఆర్ అహంకారం బొంద పెట్టడానికి, కెసిఆర్ పార్టీని తెలంగాణలో ఖతం పట్టించడానికి. అదే పని చేస్తున్నామన్నారు.

ఈటెల విమర్శలు ఆయన మాటల్లోనే…

35 ఏళ్లుగా ప్రజా ప్రతినిధిగా పని చేసిన కెసిఆర్. దళిత బందు ఎప్పుడు పెట్టారు. 2021లో నన్ను ఓడగిట్టే దమ్ము లేక నా కోసం తెచ్చారు. అప్పుడే రీసెర్చ్ చేసినట్టు చెప్పారు. 47 వేల ఓట్ల కోసం తెచ్చాడు. ప్రేమతో ఇస్తే కాళ్ళు మొక్కే వాడిని.. కానీ నన్ను ఓడగొట్టడానికి చేసిన పని కాబట్టి కెసిఆర్ ను దుర్మార్గుడు అంటున్న. దావత్ లు ఇచ్చి ముక్కు పచ్చ లారని పిల్లలకు మందు అలవాటు చేశారు. మానిపించడానికి ఆ తల్లులకు 6 నెలలు పట్టింది.

మునుగోడులో కూడా.. నల్లికుట్లోల్ల లెక్క చాటు చాటుగా తాగిపిస్తున్నారు. డబ్బులు ఇచ్చి కండువాలు కప్పుతున్నారు. గన్నులు పెడితే కూడా సమాచారం ఇవ్వని గడ్డ హుజూరాబాద్. తెలంగాణ ప్రజలకు గొప్ప సంకేతం ఇచ్చింది హుజూరాబాద్ . ఇప్పుడు ఆవంతు మునుగోడుకు వచ్చింది. బోర్లు వేసి వేసి ప్రపంచానికి బోర్లు వేసే టెక్నిక్ ఇచ్చిన గడ్డ నల్లగొండ, బావులు తవ్వడం నేర్పిన గడ్డ నల్లగొండ. చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య వారసులు..దావతులు, డబ్బు సంచులకు లోంగేవారు కాదు ఈ బిడ్డలు.

8 ఏళ్లుగా అక్రమంగా సంపాదించిన 2 లక్షల కోట్ల డబ్బులు కెసిఆర్ దగ్గర ఉన్నాయి. కెసిఆర్ ఆ డబ్బుని నమ్ముకున్నారు. కెసిఆర్ సొంత కార్యకర్తలు, సర్పంచ్ లని నమ్మడం లేదు. ఇంటెలిజెన్స్ పోలీసులను నమ్ముకున్నారు. మంత్రి తాగుతూ దొరికారు. పైగా తాగితే తప్ప అంటారు. నీ ఇంటికాడ తాగు.. కానీ మునుగోడు వచ్చి పొద్దు పొద్దున ఆ పని చేస్తారా ? ఓటు మన ఆత్మగౌరవం. దాన్ని కొనే ప్రయత్నంలో భాగమే ఈ దావత్లు. అటుకులు బుక్కి ఉద్యమం చేసిన అన్న కెసిఆర్ కి ఇన్ని డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి. పదేళ్ల క్రితం కెసిఆర్ చెప్పిన మాటలు.. తీసుకునే దిక్కు తీసుకోండి ఎసుకొనే దిక్కు వేసుకోండి అని చెప్పారు. అదే ఆయనకు మనం అప్ప జెప్పాలి కదా?

2018 ఎన్నికల్లో 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అని 4 ఏళ్లుగా ఇవ్వకుండా.. మునుగోడు ఎన్నికలు రాగానే ఇచ్చారు. 10 లక్షల మంది ఆడబిడ్డలకు పెన్షన్ కి వచ్చింది అంటే కారణం రాజగోపాల్ రెడ్డి. ఉద్యమం చేసిందే నౌకర్లు కోసం .. మరి వచ్చాయా ? ఉద్యోగాలు వచ్చే వరకు 3016/- ఇస్తా అని ఎందుకు ఇవ్వలేదు.అప్పటి నుండి లెక్క కట్టి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్న. మనసు లేకనా.. పైసలు లేకనే ఎందుకు ఇవ్వడం లేదు. బాధ్యతతో తెలిసి మాట్లాడుతున్న. ఈ మాటల మీద ఎక్కడికి అయినా చర్చకు సిద్దం. నాలాంటి వారికి రైతుబంధు ఇస్తావా కెసిఆర్. మిస్టర్ సీఎం నువ్వు ఎవరి పక్షాన ఉంటావు. బెంజ్ కార్ల వారికా ? నష్టపోతున్న కౌలు రైతులకా ? జే కేసారంలో నొప్పి గోలీ దొరుకుతుందో లేదో అనే కదిలేస్తే అర్థరాత్రి కూడా మద్యం సీసా దొరుకుతుంది. ఇది కెసిఆర్ పాలన అని ఈటెల రాజేందర్ విమర్శించారు.

Also Read : కెసిఆర్ ను వదిలే ప్రసక్తే లేదు ఈటెల రాజేందర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్