Sunday, January 19, 2025
HomeTrending Newsఉద్యమాల గడ్డపై బీజేపీని బొందపెడుతాం : తమ్మినేని వీరభద్రం

ఉద్యమాల గడ్డపై బీజేపీని బొందపెడుతాం : తమ్మినేని వీరభద్రం

ఉద్యమాల గడ్డపై కాషాయ జెండాలను ఎగురనివ్వం. బీజేపీని ఓడించడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫైర్‌ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సీపీఎం మునుగోడు నియోజవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గత 8 సంత్సరాలుగా రాజ్యాంగ హక్కులు, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తూ దేశంలో దుర్మార్గ పాలన బీజేపీ చేస్తోందని మండిపడ్డారు.

దేశంలో అన్ని మతాల వారు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇప్పుడు మైనార్టీలు ఈ దేశంలో ఉండొద్దు అని బీజేపీ వాళ్లు మత ఘర్షలను రెచ్చ గడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. తెలంగాణ సాయుధ వారోత్సవాలు, స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు నిర్వహించే హక్కు బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రాలకు ఉన్న అన్ని హక్కులను లాక్కుంటు కేంద్రం నియంతృత్వ పాలన సాగిస్తున్నది మండిడ్డారు.

దేశ హోం మంత్రిగా ఉండి అమిత్ షా మునుగోడు సభలో స్పష్టంగా తెలిపారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నెల రోజుల్లో కూలగొడుతాం అని ఎలా చెబుతారని నిలదీశారు. సాయుధ పోరాటాలతో అన్యాయాల్ని ఎదురించిన తెలంగాణ గడ్డపై బీజేపీని అడ్డుకోవడమే తమ ఎజెండా అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడాలని కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

Also Read: మునుగోడులో కారుకే సీపీఏం మద్దతు

RELATED ARTICLES

Most Popular

న్యూస్