Wednesday, March 18, 2026
Homeసినిమాత్వరలో అఖండ 2.. క్లారిటీ ఇచ్చిన థమన్

త్వరలో అఖండ 2.. క్లారిటీ ఇచ్చిన థమన్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ’. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అన్నివర్గాల ప్రేక్షకులను అఖండ చిత్రం ఆకట్టుకుని బాలయ్య కెరీర్ లో అప్పటి వరకు ఉన్న రికార్డులను క్రాస్ చేసింది. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. బాలయ్య తప్పా.. ఇంకెవరూ ఆ పాత్రలో అంతలా అద్భుతంగా నటించలేరు అనేంతగా నటించి మెప్పించారు. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీతో హ్యాట్రిక్ సాధించారు.

అయితే.. అఖండ విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ అఖండ సీక్వెల్ ప్రకటించారు. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని బాలయ్య అభిమానులతో పాటు ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే.. లేటెస్ట్ గా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆసక్తి గా మారింది. ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు అఖండ మూవీలో క్లిప్ తో తెలుపుతూ త్వరలోనే అఖండ 2 తో కలుద్దాం అంటూ పోస్ట్ చేసాడు.

దీనితో అఖండ సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇటీవల వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బాలయ్య ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో భారీ చిత్రం చేస్తున్నారు. ఇందులో బాలయ్యకు కూతురుగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల నటిస్తుంది. ఈ నెలాఖరు నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అయితే… అఖండ 2 చిత్రం బాలయ్య అనిల్ రావిపూడితో చేస్తున్న ప్రాజెక్ట్ తర్వాతే ఉంటుందా..? లేక ఇంకా టైమ్ పడుతుందా..? అనేది తెలియాల్సివుంది. అయితే.. అఖండ 2 త్వరలోనే అని థమన్ క్లారిటీ ఇవ్వడం ఆసక్తిగా మారింది. మరి.. బోయపాటి ‘అఖండ 2’ తో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read : మా ఇద్ద‌రినీ ఆ దేవుడే క‌లిపాడు : బాల‌కృష్ణ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular