Saturday, November 23, 2024
HomeసినిమాBhola Shankar: చిరంజీవి గారితో జర్నీ మెమరబుల్ : అనిల్ సుంకర

Bhola Shankar: చిరంజీవి గారితో జర్నీ మెమరబుల్ : అనిల్ సుంకర

మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  పాటలు,  ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత అనిల్ సుంకర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

చిరంజీవి గారితో సినిమా చేయడం అనేది ఎవరికైనా ఒక కల.. ఆ కల ఇంత త్వరగా నెరవేరుతుందని ఊహించలేదు కానీ.. ఇప్పుడది నెరవేరుతోంది. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే చిరంజీవి గారు రాజకీయాల్లో వున్నారు. అలాంటప్పుడు సినిమా అనే ఆలోచన రాదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వేడుక కోసం చిరంజీవి గారిని ఆహ్వానించడానికి వెళ్లాం. ఆయన్ని తొలిసారి కలిసింది అప్పుడే. సరదాగా మాట్లాడుతూ… ‘’మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నానండీ ఫైనల్ గా కలిశాను’’ అని అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ‘కలవడం ఏంటండీ? సినిమా చేస్తున్నాం’’ అన్నారు. నా దగ్గర వేదాళం కన్నడ రైట్స్ వున్నాయి. రమేష్ గారు ‘సరిలేరు నీకెవ్వరు’ గుంటూరు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సమయంలో రోజూ కలసి చిరంజీవి గారికి వేదాళం ఐతే ఎలా వుంటుందని మాట్లడేవాళ్ళం. అలా ఈ సినిమా జర్నీ మొదలైయింది.

చిరంజీవి గారి అనుభవం మా అందరికీ కలిసొస్తుంది. ఆయన చాలా చురుగ్గా వుంటారు. మనతో మాట్లాడుతూనే .. సడన్ గా షాట్ రెడీ అయ్యిందని వాళ్ళు రాకముందే తెలుసుకొని వెళ్ళిపోతారు. అటు వైపు ఎప్పుడు చూశారా ? అని ఆశ్చర్యపోవడం మనవంతౌతుంది.  ఆయన సమయపాలన అద్భుతం. వేదాళం రీమేక్ రైట్స్ ఎఎం రత్నం గారి దగ్గర ఉన్నాయి. రత్నం గారు నాకు బాగా క్లోజ్. వేరే వాళ్లకి ఐతే ఇచ్చేవాళ్ళు కాదేమో. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో గొప్పగొప్ప సినిమాలు తీశారు.  ఆయన్ని కలవడమే ఒక మంచి అనుభవం. మా మధ్య మంచి అనుబంధం వుంది. వేదాళం మొదట హిందీలో చేయాలని అనుకున్నాను. ఐతే ఇప్పుడు ఆయనే చేస్తున్నారు. కన్నడలో  ఓ స్టార్ హీరోతో చేద్దామని సన్నాహాలు చేస్తుండగా ఈలోగా చిరంజీవి గారు డేట్స్ ఇవ్వడంతో కన్నడని పోస్ట్ పోన్ చేసి భోళా శంకర్ చేశాం.

మేము అనుకున్న ఓపెనింగ్స్ వస్తాయి. భోళా శంకర్ మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అవుట్ పుట్ పై చిరంజీవి గారు, మేము చాలా హ్యాపీ గా వున్నాం. ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ అవుట్ అయిన ఫీలింగ్ వుంది. బ్రదర్ సిస్టర్ ఎమోషన్ యూనివర్సల్. అందరికీ కనెక్ట్ అవుతుంది.
మహేష్ బాబు గారితో సినిమా షూట్ చేసేటప్పుడు నేను ప్రతిరోజు సెట్ లో వుంటాను. నాకు ,మహేష్ కి మధ్య ఆ బాండింగ్ వుంటుంది. మిగతా సినిమా షూటింగులకు నేను ఉండను. భోళా శంకర్ చేసేటప్పుడు ‘ఒక హీరోగా చెబుతున్న. ప్రతిరోజు మీరు సెట్ లో వుండాలి. నిర్మాత సెట్ లో వుంటే చిరంజీవి గారు చాలా ఆనందపడతారు’ అని మహేష్ చెప్పారు. 120 వర్కింగ్ డేస్ లో దాదాపు 40 రోజులు చిరంజీవి గారితో వున్నాను. ఇది చాలా మెమరబుల్ జర్నీ. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకున్నా. ఒక్క రోజు కూడా వృధా కాదు. చాలా ఎంజాయ్ చేశాను.

RELATED ARTICLES

Most Popular

న్యూస్