Thursday, March 19, 2026
HomeసినిమాMister-Mythri: మైత్రీ మూవీస్ ద్వారా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’

Mister-Mythri: మైత్రీ మూవీస్ ద్వారా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’

సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.  ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా  నైజాంలో ఈ సినిమా విడుదల కాబోతోంది. మంచి రేట్ కు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది. ఇలాంటి ఫేమస్ సంస్థ ద్వారా తమ సినిమా గ్రాండ్ గా విడుదలవుతుండటం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది.

మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఇటీవల కింగ్ నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేసిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటి ప్రతి కంటెంట్ కూడా వారి ఆసక్తికి తగినట్లే ఉండి ఆకట్టుకుంటోంది. పర్పెక్ట్ రిలీజ్ తో అన్ని సెంటర్స్ ఆడియెన్స్ కు రీచ్ కాబోతోంది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular