Sunday, January 19, 2025
Homeసినిమాఓటీటీకి వచ్చేస్తున్న 'నా సామిరంగ'

ఓటీటీకి వచ్చేస్తున్న ‘నా సామిరంగ’

సంక్రాంతి బరిలోకి దిగిన సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఓటీటీ బాటపడుతున్నాయి. ఆల్రెడీ ‘గుంటూరు కారం’ .. ‘సైంధవ్’ సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేశాయి. ఇక ఇప్పుడు ‘నా సామిరంగ’ ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. నాగార్జున – ఆషిక రంగనాథ్ జంటగా నటించిన ఈ సినిమా, జనవరి 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నాగార్జునకి సంక్రాంతి పండుగ సెంటిమెంట్ ఉంది. అందువలన ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి వదలాలని గట్టి పట్టుదలతో రంగంలోకి దిగారు. మూడు నెలలలోనే ఈ సినిమాను సంక్రాంతి పోటీలో నిలబెట్టారు. ‘ సోగ్గాడే చిన్ని నాయన’ .. ‘బంగార్రాజు’ మాదిరిగానే ఈ సినిమా నాగార్జున సెంటిమెంట్ మరింత బలపరిచింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ కథలో సంక్రాంతి పండుగ నేపథ్యం ఉండటం వలన ఆడియన్స్ కి మరింత ఫాస్టుగా కనెక్ట్ అయింది.

నాగార్జున పాత్ర వైపు నుంచి రొమాన్స్ .. యాక్షన్ ఎపిసోడ్స్ వర్కౌట్ అయ్యాయి. అలాగే అల్లరి నరేశ్ పాత్ర వైపు నుంచి ఎమోషన్స్ ను కనెక్ట్ చేశారు. ఇక సంక్రాంతి అంటేనే పల్లె పండగ. అందువలన గ్రామీణ వాతావరణంలో నడిచే ఈ కథను అంతా ఓన్ చేసుకున్నారు. ఆషిక రంగనాథ్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఇలా అన్ని వైపులా నుంచి ఆకట్టుకున్న ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి మంచి మార్కులు కొట్టేయడం ఖాయమనే చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్