Sunday, January 19, 2025
Homeసినిమాఅందాల నభా ...ఆ ముగ్గురినీ తట్టుకోవడం కష్టమే!

అందాల నభా …ఆ ముగ్గురినీ తట్టుకోవడం కష్టమే!

Nata: తెలుగు తెరపై ముద్దుగా .. ముద్దబంతి పువ్వులా కనిపించే కథానాయికలలో నభా నటేశ్ ఒకరు. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం నభా నటేశ్ సొంతం. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయమైంది. అమ్మాయి అందమైన చందమామలా ఉందని చెప్పేసి కుర్రాళ్లంతా కూడబలుక్కుని పొలోమంటూ ఓట్లు వేశారు. ఆ తరువాత ‘ ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ హిట్ ను ఈ సుందరి సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అందాలు ఆరబోయడానికి ఆమె ఎంతమాత్రం మొహమాటపడలేదు.

‘ఇస్మార్ట్ శంకర్’లో నభా అందాల విన్యాసాలను చూసి ఇక అప్పట్లో ఈ అమ్మాయి గ్రాఫ్ ను అడ్డుకోవడం ఎవరి వలనా కాదని అనుకున్నారు. తెరపై ఆమె జోరు .. యేరు మాదిరిగా కొనసాగడం ఖాయమని చెప్పుకున్నారు. నిజంగానే అంతా అనుకున్నట్టుగానే ఆమెకి వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. చాలా కాలానికి వెండితెరను వేడెక్కించే అమ్మాయి దొరికిందని అనుకున్నారు. అలా ఆమె ఏకంగా రవితేజ సరసన నాయికగా ‘డిస్కోరాజా’ సినిమా చేసింది. ఆమె నుంచి గ్లామర్ ఆశించి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ కలగలేదు. కానీ కథాకథనాల పరంగా ఆమె ఖాతాలోకి ఫ్లాప్ చేరిపోయింది.

ఆ తరువాత సాయితేజ్ సరసన  చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ .. ‘బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా చేసిన ‘అల్లుడు అదుర్స్’ .. ‘నితిన్ సరసన  చేసిన ‘మాస్ట్రో’ ఆమెకి కలిసి రాలేదు. మసాలా జోడించినా .. గ్లామర్ డోస్ పెంచినా హిట్ అనేది కరగలేదు .. ఆమె వైపు ఒరగలేదు. వరుస పరాజయాలు నభా నటేశ్ ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కొత్తగా ఏ ప్రాజెక్టులలో కూడా ఆమె  పేరు వినిపించడం లేదు .. కనిపించడం లేదు. ఒక వైపున కృతి శెట్టి .. మరో వైపున శ్రీలీల ..ఇంకో వైపున కేతిక శర్మ విజృంభిస్తుండటమే ఇందుకు కారణం అనుకోవాలేమో!

Also Read : కొత్త ప్రాజెక్టుల కోసం క్రేజీ భామల వెయిటింగ్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్