Tuesday, March 10, 2026
HomeTrending NewsNAFFCO: తెలంగాణకు దుబాయ్ దిగ్గజ సంస్థ

NAFFCO: తెలంగాణకు దుబాయ్ దిగ్గజ సంస్థ

దుబాయిలో మంత్రి కే తారక రామారావు పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రి తారక రామారావు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టబడితో మంత్రి కేటీఆర్ తన పర్యటన ప్రారంభించారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూఏఈ దిగ్గజ సంస్థ NAFFCO కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కే. తారక రామారావుతో జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ (NAFFCO
Khalid Al Khatib, CEO) ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారుచేయునున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా 700 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపింది. భారతదేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం రానున్న రానున్న దృష్ట్యా  వ్యాప్తం పెరుగుతుందనే విశ్వాసం తమకుందని Naffco తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ భారతదేశ డిమాండ్ ను తీరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

దీంతోపాటు తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీ రామారావు ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ద్వారా దాదాపు 100పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ సీఈవో మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular