Monday, July 1, 2024
Homeసినిమానాగ్ అశ్విన్ చాలా రిస్క్ తీసుకున్నట్టే!

నాగ్ అశ్విన్ చాలా రిస్క్ తీసుకున్నట్టే!

సినిమాకి ఏది ప్రాణం అంటే స్క్రిప్ట్ అనే మాటను ఎంతోమంది అనుభవజ్ఞులు చెప్పారు. కథ మాత్రమే తెరపైకి వెళ్లిన సినిమాను కాపాడుతుంది. ఆ కథ బాగున్నప్పుడు .. దానికి స్టార్స్ హెల్ప్ అవుతారు. కథ బాగోలేకపోతే ఎంత కాకలుదీరిన స్టార్స్ ఉన్నప్పటికీ చేసేదేమీ ఉండదు. అందువలన కథను రెడీ చేసుకోవడం .. ఆ కథను తమ బడ్జెట్ కి తగినట్టుగా ఎలా మార్చుకోవచ్చు అనే ఆలోచన చేయడం ముఖ్యం. ఎందుకంటే కథను బట్టే ఖర్చు ఉంటుంది కాబట్టి.

ఇలాంటి పరిస్థితుల్లోనే నాగ్ అశ్విన్ ‘కల్కి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, రికార్డుస్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ సినిమా చూసినవారికి నాగ్ అశ్విన్ రిస్క్ చేశాడని తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే కథ ప్రకారం కాలంలో చాలా వెనక్కి వెళ్లాడు .. అక్కడి నుంచి చాలా ముందుకు కూడా వెళ్లాడు. నిజానికి ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఎక్కడా ఈ కాలానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించకూడదు.

మహాభారతంలో ఏ అంశాన్ని ఇలా టచ్ చేసి .. అలా బయటపడటం కుదరదు. ఒకదానికొకటి ముడిపడిపోయి కనిపిస్తాయి. ఈ సినిమాలోని కీలకమైన పాత్రగా కనిపించే అశ్వద్ధామ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. గడిచినకాలం .. రానున్న కాలం మధ్యలో ఆడియన్స్ ను కూర్చోబెట్టాడు నాగశ్విన్. ఈ రెండు కాలాలకు సంబంధించిన యుద్ధవాతావరణం .. కాస్ట్యూమ్స్ .. ఆయుధాలు .. వాహనాలు .. ఇలా ఎన్నో ఉంటాయి. వాటిని డిజైన్ చేయడం .. వీ ఎఫ్ ఎక్స్ ద్వారా అనుకున్న అవుట్ పుట్ రాబట్టడం అంత తేలికైన విషయమేం కాదు. ఇలాంటి ఒక కంటెంట్ ను సెట్ చేసుకుని, నాగ్ అశ్విన్ పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్