Friday, October 18, 2024
HomeసినిమాChaitu, Akhil: చైతు, అఖిల్ కాంబో మూవీ నిజమేనా..?

Chaitu, Akhil: చైతు, అఖిల్ కాంబో మూవీ నిజమేనా..?

అక్కినేని బ్రదర్స్ చైతన్య, అఖిల్ కలిసి సినిమా చేస్తే.. చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ‘మనం’ తరహాలోనే అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి చేసే సినిమా ప్లానింగ్ లో ఉందని.. ఇందులో చైతూ, అఖిల్ మెయిన్ రోల్స్ చేయనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

అయితే.. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అఖిల్ ఏజెంట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. అలాగే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ని అతి త్వరలో అనౌన్స్ చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఈ సందర్భంలో నాగ చైతన్యతో మల్టీస్టారర్ చేసే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేయడం ఈజీనే కానీ.. ఇద్దరు అన్నదమ్ములు కలిసి మల్టీ స్టారర్ చేయడం అంటే కాస్త ఇబ్బందే. పాత్రలు ఎలా ఉండాలి..? స్క్రిప్ట్ ఎలా ఉండాలి..? అనే విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి.

మా అన్నదమ్ములు ఇద్దరికీ సెట్ అయ్యే మంచి స్క్రిప్ట్ వస్తే.. తప్పకుండా సినిమా చేస్తాను అని అఖిల్ చెప్పారు. చైతు అన్నయ్యతో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని… తప్పకుండా..  చైతూ తో కలిసి సినిమా చేస్తామని ప్రకటించారు. అఖిల్ అలా ప్రకటించినప్పటి నుంచి అక్కినేని బ్రదర్స్ మల్టీస్టారర్ కన్ ఫర్మ్ అయ్యిందని వార్తలు ఊపందుకున్నాయి. అయితే.. ఇద్దరికీ సరిగ్గా సెట్ అయ్యే స్టోరీ ఇంకా సెట్ కాలేదు. స్టోరీ సెట్ అయితే.. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం. మరి…ఈ క్రేజీ మల్టీస్టారర్ ఎప్పుడు వస్తుందో..? ఎవరు డైరెక్ట్ చేస్తారో..? చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్