Sunday, January 19, 2025
Homeసినిమాచైతూ - చందూ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

చైతూ – చందూ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కంగారు పడి సినిమాలు చేయాలి అనుకోవడం లేదు. ఆలస్యం అయినా ఫరవాలేదు.. అందరికీ నచ్చే.. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యే సినిమా చేయాలి అనుకుంటున్నాడు. అందుకనే కస్టడీ సినిమా రిలీజైన 3 నెలలు అవుతున్నప్పటికీ కొత్త సినిమాని ఇంకా సెట్స్ పైకి తీసుకురాలేదు. చందు మొండేటితో నాగచైతన్య ఓ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తుండడం విశేషం.

అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కే కథ. అందుచేత మత్య్యకారుల జీవితాల గురించి మరింతగా తెలుసుకునేందుకు ఇటీవల చైతన్య, చందూ మొండేటి, బన్నీ వాసు కలిసి శ్రీకాకుళం వెళ్లి అక్కడున్న మత్య్యకారులను కలవడం మరిన్ని విశేషాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉంది కానీ.. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది క్లారిటీ లేదు. దీంతో ఎప్పుడెప్పుడు చైతన్య సినిమా సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారట. ఇక ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అంటే.. సాయిపల్లవి, కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే… సాయిపల్లవి గతంలో లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్యకు జంటగా నటించింది. అందుచేత కీర్తి సురేష్ అయితే.. కాంబో ఫ్రెష్ గా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. వీరిద్దరూ కాకపోతే అప్పుడు బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేద్దామనుకుంటున్నారట. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్