Sunday, January 19, 2025
HomeసినిమాNaga Chaitanya: నాగచైతన్య 'కస్టడీ' టార్గెట్ ఎంత?

Naga Chaitanya: నాగచైతన్య ‘కస్టడీ’ టార్గెట్ ఎంత?

టాలీవుడ్ హీరో నాగచైతన్య, కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘కస్టడీ’. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ్ లో రూపొందిన ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ ఉంది. నాగచైతన్య ఈ సినిమా సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు. మే 12న భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇటీవల అఖిల్ ‘ఏజెంట్’ ఫ్లాప్ కావడంతో ‘కస్టడీ’పైఅక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.  నైజాంలో 7.50 కోట్లు, సీడెడ్ లో 2.20 కోట్లు ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 18.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా హక్కులకు 1.20 కోట్లు బిజినెస్ జరగ్గా.. ఓవర్సీస్ రైట్స్ 2.40 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా తెలుగు వెర్షెన్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని 21.80 కోట్లు బిజినెస్ జరిగింది.

అంటే.. 22 కోట్ల రూపాయలు వసూలైతేనే హిట్ స్టేటస్ సొంతమవుతుంది.  నాగ చైతన్య గత సినిమా థ్యాంక్యూ నిరాశ పరచడంతో  ఈ సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్నాడు. తెలుగు, తమిళ్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేయడంతో ఆడియన్స్ లోకి బాగా వెళ్లింది. తమిళ్ లో నాగచైతన్యను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరి.. కస్టడీ టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్