Thursday, March 19, 2026
Homeసినిమాచైతు రిస్క్ చేస్తున్నాడా..?

చైతు రిస్క్ చేస్తున్నాడా..?

నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కస్టడీ‘. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగచైతన్యకు జంటగా కృతి శెట్టి నటిస్తుంటే.. కీలక పాత్రలో ప్రియమణి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు ఇలా వరుసగా సక్సెస్ సాధించిన చైతన్య.. థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా చిత్రాలతో మెప్పించలేకపోవడంతో ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలని పట్టుదలతో కస్టడీ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. కస్టడీ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండటంతో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఇందులో చైతు.. శివ అనే పేరు గల కానిస్టేబుల్ గా కనపడనున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం భారీ సెట్స్ వేశారు. కేవలం ఒక పాట కోసమే ఏడు సెట్లు వేస్తున్నారు. ఈ సాంగ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.

థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా.. ఈ రెండు చిత్రాలు ప్లాప్ అయినప్పటికీ కస్టడీ సినిమా కోసం ఇంత స్థాయిలో ఖర్చు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గతంలో నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి బంగార్రాజు సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఈ జంట అదిరిపోయే కెమిస్ట్రీ పండించింది. కాబట్టి ఈ కెమిస్ట్రీ రిపీట్ అయితే ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. చైతు ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బడ్జెట్ మూవీ చేయడం రిస్క్ అనే టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ.. కథ పై ఉన్న నమ్మకంతో భారీగా ఖర్చు చేస్తున్నారు. మరి.. కస్టడీ మూవీతో చైతు ఆశించిన విజయం సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular