Friday, October 18, 2024
Homeసినిమా'కస్టడీ' నుంచి నాగచైతన్య విడుదల!

‘కస్టడీ’ నుంచి నాగచైతన్య విడుదల!

అక్కినేని నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్న మూవీ ‘కస్టడీ‘. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ద్విభాషా  చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ ఇందులో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంటే.. సీనియర్ యాక్టర్ అరవింద్ స్వామి విలన్ గా నటిస్తుండడం విశేషం. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవల నాగచైతన్య నటించిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో కస్టడీ మూవీతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలి అనుకుంటున్నారు. ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో నాగచైతన్య కానిస్టేబుల్ క్యారెక్టర్ చేస్తుండడం.. ఇది మాస్ అండ్ యాక్షన్ మూవీ కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ సందర్భంగా కస్టడీ టీమ్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇంట్రస్టింగ్ గా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కస్టడీ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండడం విశేషం. ఈ కస్టడీ చిత్రాన్ని మే 12 న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో తెలుగులోనే కాదు.. తమిళ్ లో నాగచైతన్య ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడు అనేది ఆసక్తిగా మారింది. రిలీజ్ కి ఇంకా టైమ్ ఉండడంతో ఇప్పటి నుంచి డిఫరెంట్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సమ్మర్ లో వస్తుంది కాబట్టి ప్లస్ పాయింట్ కావచ్చు.

Also Read : ఏడు భారీ సెట్స్ లో నాగ చైతన్య, ‘కస్టడీ’

RELATED ARTICLES

Most Popular

న్యూస్