Sunday, January 19, 2025
HomeసినిమాCustody: నాగచైతన్య నమ్మకం నిజం అవుతుందా..?

Custody: నాగచైతన్య నమ్మకం నిజం అవుతుందా..?

అక్కినేని అభిమానులు అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఇది అందరికీ పెద్ద షాక్ అని చెప్పచ్చు. ఇప్పుడు నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో నాగచైతన్య కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసారు. టీజర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. అలాగే ఈ సినిమాలోని పాయింట్ కూడా కొత్తగా ఉండడంతో కస్టడీ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది.

మే 12న కస్టడీ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాగచైతన్య తప్పకుండా కస్టడీ చిత్రం అందరికీ థ్రిల్ కలిగిస్తుందని.. తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే.. ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని.. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని అంటున్నారు. దీంతో అక్కినేని అభిమానులు కస్టడీ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అఖిల్ బాబు ఎలాగూ సక్సెస్ సాధించలేదు. కనీసం చైతన్య అయినా కస్టడీతో విజయం సాధిస్తే.. బాగుంటుంది అనుకుంటున్నారు.

కస్టడీ విషయంలో పూర్తి నమ్మకంతో సినిమా చూడొచ్చని కాన్ఫిడెన్స్ నింపాడు చైతన్య. ఒక డిఫరెంట్ పాయింట్ తో దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారని సక్సెస్ అవుతుందని గట్టిగా చెప్పాడు. అభిమానులకు కావాల్సింది ఈ ఊరటే. ఏజెంట్ ప్లాప్ అవ్వడంతో.. అఖిల్ దుబాయ్ వెళ్ళిపోయాడు. నాగార్జున యు.ఎస్ వెళ్లారు. అభిమానుల దృష్టి అంతా చైతూ మీదే ఉంది. అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలో భాగంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఫ్యాన్స్ తో ప్రత్యేకంగా ఫోటో షూట్ ప్లస్ మీటింగ్ ఏర్పాటు చేశాడని టాక్.. గంటల తరబడి సాగేలా ఈ ప్రోగ్రాం ప్లానింగ్ జరుగుతోందని తెలిసింది. మరి.. కస్టడీ మూవీ పై చైతన్య నమ్మకం నిజం అవుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్