Friday, March 20, 2026
Homeసినిమాచైతు మాస్ ప్రయత్నం ఫలిస్తుందా..?

చైతు మాస్ ప్రయత్నం ఫలిస్తుందా..?

నాగచైతన్య ‘మజిలీ’, ‘వెంకీమామ’, ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’.. ఇలా వరుసగా సక్సెస్ సాధించారు. ఆతర్వాత నాగచైతన్య నటించిన ‘థ్యాంక్యూ’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. సున్నిత ప్రేమకథా చిత్రంగా రూపొందిన థ్యాంక్యూ నాగచైతన్యకు మంచి పేరు తీసుకువచ్చింది కానీ.. కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేదు. అలాగే బాలీవుడ్ లో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఇలా వరుసగా రెండు ప్లాపులు చూసిన నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ అనే భారీ మాస్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో రూపొందుతుంది.

ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగచైతన్యకు జంటగా కృతిశెట్టి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తుంటే.. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇందులో నాగచైతన్య కానిస్టేబుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీతో డైరెక్టర్ వెంకట్ ప్రభు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంటే.. నాగచైతన్య కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ద్విభాషా చిత్రం పై అటు తమిళ్, ఇటు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మే 12న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో నాగచైతన్య ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలని పట్టుదలతో కస్టడీ మూవీ చేస్తున్నారు. ఇప్పటి వరకు నాగచైతన్య నటించిన మాస్ సినిమాలు ‘దడ’, ‘ఆటోనగర్ సూర్య’, ‘యుద్ధంశరణం’, ‘సవ్యసాచి’ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ఈసారి చేస్తున్న మాస్ మూవీ కస్టడీ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మరి.. నాగచైతన్య మాస్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో..?

Also Read : ‘కస్టడీ’ ఇంట్రస్టింగ్ అప్ డేట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular